నిజామాబాద్ సభలో మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

నిజామాబాద్ సభలో మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

👉నిజామాబాద్ జిల్లాకు చెందిన మలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకం ఎగురవేసారు. మహ్మద్ హుస్సేన్ కామన్ వెల్త్ గేమ్స్ లో పతకం గెలిచి దేశ గౌరవం పెంచారు. ఈ యువ కిశోరాలు న్యూ ఇండియాకు ప్రతీకలు..

👉ప్రజల త్యాగం, పోరాటం, బలిదానంతో తెలంగాణ సాకారమైంది. అటువంటి తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు అస్తవ్యస్తం కాకూడదు. సమగ్ర అభివృద్ధి, న్యూఇండియాపై నమ్మకం ఉంచే ప్రజలు.. నవ తెలంగాణ నిర్మాణం కోసం భుజం భుజం కలిపి బిజెపికి అండగా నిలబడాలి..

👉గత నాలుగున్నరేళ్ల ముందు యువత, రైతులు, పేదలు, దళితులు, ఆదివాసీల విషయంలో ఇక్కడి పాలకులు ఏం సేవ చేశారు.. ఏం అభివృద్ధి సాధించారు..?

👉తెలంగాణలో ఉండే ప్రస్తుత ప్రభుత్వం, పార్టీ, కుటుంబం గత కాంగ్రెస్ పద్దతినే అనుసరిస్తోంది. అభివృద్ధి చేయకున్నా ఎన్నికల్లో గెలవొచ్చనే భావిస్తోంది. కానీ సమయం మారింది. అభివృద్ధి లేకుంటే ప్రజలు గెలిపించరు. ఇక్కడి సీఎం నిజామాబాద్ ను లండన్ చేస్తానన్నారు… స్మార్ట్ సిటి చేస్తానన్నారు.. కానీ కరెంటు, రోడ్లు, తాగునీటి వసతులు కూడా లేకుండా నిజామాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వస్తూ హెలికాఫ్టర్ లో చూస్తే పేద రాష్ట్రాల కన్నా ఇక్కడి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.

👉ఇక్కడి ముఖ్యమంత్రి అసంపూర్తికి ప్రతీక.. వారు చేపట్టిన ఏ పనులు, కార్యక్రమాలను పూర్తి కాలేదు. అంతేకాదు ఐదు సంవత్సరాల తన పదవీకాలాన్ని సైతం అసంపూర్తిగానే ముగించారు. ఇలాంటి వారిపై విశ్వాసం పెట్టుకుంటామా..?

👉తెలంగాణలో వైద్యం రంగం అధ్వానంగా ఉంది. పేదలకు సరైన వైద్యం అందడం లేదు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఎంతటి దుస్థితిలో ఉందో అక్కడి విద్యార్థులను అడిగితే చెప్తారు. దీని కన్నా ఓ సాధారణ హాస్టల్ మెరుగ్గా ఉంటుంది.

👉పేదల ఆరోగ్య భద్రతకు నిర్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అభద్రతాభావంతో ఉన్న ఇక్కడి సీఎం తెలంగాణలో అమలు చేసేందుకు నిరాకరించారు. పేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా సదుపాయం అందక తెలంగాణ పేదలకు తీరని నష్టం వాటిల్లింది.

👉‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’… బిజెపి మంత్రం.. నినాదం.. కానీ ఇతర పార్టీలవి ఓటుబ్యాంకు రాజకీయాలే. ఈ ఓటుబ్యాంకు రాజకీయాలతో దేశాభివృద్ధి కుంటుపడింది.

👉పంచతత్వాలతో కూడిన అభివృద్ధి బిజెపి విధానం.. అందరికీ విద్య.. అందరికీ పని.. పేదల ఆదాయాన్ని పెంచడం.. వృత్తి కళాకారులకు సాయం.. ప్రతి పంటకు, ప్రతి చేనుకు నీరు.. ఈ పంచతత్వతోనే బిజెపి ముందుకెళ్తోంది.

👉మీ ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తుంది.. ఈ ఎన్నికల విశ్లేషకులు ఈ ఉత్సాహాన్ని చూస్తే తెలంగాణలో ఏవిధమైన వాతావరణం ఉందో కనిపిస్తుంది.

👉రిమోట్ కంట్రోల్ తో పనిచేసిన 10 సంవత్సరాల యూపీఏ ప్రభుత్వంలో ఇక్కడి ముఖ్యమంత్రి కూడా మంత్రిగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు.. వీరిద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తోంది.

👉ఇటీవల తెలంగాణలో జరిగిన బహిరంగ సభకు సోనియాగాంధీ గారు వచ్చారు. ఆ వేదికపై ఆమెతో పాటు ఆమె సుపుత్రుడు కూడా ఉన్నారు. అప్పుడు ప్రసంగిస్తూ ఈ రాష్ట్రంలో కుటుంబ రాజకీయం నడుస్తుందని విమర్శించడం హాస్యాస్పదం.. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కుటుంబ రాజకీయ పార్టీలే..

👉కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య తేడా లేదు.. రెండూ కుటుంబ పార్టీలే.. మైనారిటీ సంతుష్టీకరణ, ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడేవే.. ఈ రెండు పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు.. ఈ రెండు పార్టీలు ఓకే నాణేనికి రెండు ముఖాలు లాంటివి..

👉నాకు పేదరికం ఏంటో తెలుసు.. పేదరికంలో జీవించాను.. మా అమ్మ పొగచూరిన కట్టెల పొయ్యిపై వంట చేస్తే పడిన ఇబ్బంది నన్ను బాధించేది. దేశంలో ప్రతి మాతృమూర్తికి ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం.

👉50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు కరెంటు లేదు.. ఇలాంటి పేదలకు కరెంటు ఇచ్చేందుకు సౌభాగ్య పథకం ప్రవేశపెట్టాం. దీని కింద తెలంగాణలో 4 లక్షల పేద కుటుంబాలకు విద్యుత్ ఇచ్చాం.. కేవలం నిజామాబాద్ లో 15వేల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాం.

👉గత ఎన్నికల్లో అవినీతి, అక్రమాలను అరికడుతానని వాగ్దానం చేసాను. మా ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో అత్యధిక మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించి.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడేలా చేసి అవినీతిని నిర్మూలించాం.

👉గతంలో బ్యాంకు రుణాలు కేవలం ధనికులకే లభించేవి.. 2008 నుంచి 2014 మధ్య ఇచ్చిన రుణాలు అత్యధికం సంపన్నులకే. మేము అధికారంలోకి వచ్చాక సంపన్నులకు రుణాలు అందకుండా తాళాలు వేయడంతో బ్యాంకులను లూటీ చేసేవారు ఆగమాగం అవుతున్నారు.

👉తెలంగాణ కోసం పోరాడిన యువతపై కాల్పులు జరిపిన కాంగ్రెస్ ను క్షమిస్తారా..? మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ను రానిద్దామా..?

👉కేసీఆర్ వచ్చాక తెలంగాణ మరింత దిగజారింది.. కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే కేసీఆర్.. అలాంటి కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఇంతకంటే వంద రెట్లు ఎక్కవ నష్టపోతుంది. తెలంగాణ అభివృద్ధి బిజెపితో మాత్రమే సాధ్యమవుతుంది.

👉నాలుగు తరాలు పాలించిన కాంగ్రెస్ ను లెక్కలడిగితే.. జవాబు చెప్పకుండా మోదీ కులమేంటి..? మోదీ తల్లి వయస్సెంత..? మోదీ తండ్రి పేరేంటి..? ఇలాంటి ప్రశ్నలతో ఎన్నికలకు సంబంధించిన అంశాలను పక్కదోవ పట్టిస్తోంది..

👉తెలంగాణ కష్టాలకుకారణమైన కాంగ్రెస్ ను మరోసారి రానివ్వొద్దు. తెలంగాణ ప్రజలను నేను కోరుతున్నా.. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి.. రాష్ట్రం అభివృద్ధి పథంపై పరుగులెడుతుందని హామీ ఇస్తున్నా..
#TelanganaWithMODI
#InduruWithBJP
#YendalaLaxminarayana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *